- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ వైపు పిడుగులు.. మరోవైపు భారీ వర్షాలు: ఏపీకి బిగ్ అలర్ట్
దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతీ రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కోస్తా(South Coast)కు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతీ రుతుపవనాల(Southwest monsoon) రాకతో రాష్ట్రంలో పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. శుక్రవారం కోస్తాంధ్ర(Coastal Andhra)తో పాటు రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, బాపట్ల, ఉమ్మడి విశాఖలోనూ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
పిడుగులు సైతం..
మరోవైపు పిడుగులు సైతం పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సూచించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ముందుగా పునరావాసాలకు తరలివెళ్లాలని చెప్పింది. ఇక రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావారణ శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు అధికారులు ఇస్తున్న సలహాలు, సూచనలను పాటించాలని వెల్లడించింది.






