హార్మూజ్‌లో భారత నౌకలపై దాడులు.. తీవ్రంగా ఖండించిన ట్రంప్

by Malleboina Mahesh |

హార్మూజ్‌లో భారత నౌకలపై దాడులను ఖండించిన ట్రంప్. ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని, వారి డ్రోన్లను అమెరికా బలగాలు అడ్డుకున్నాయని సంచలన ప్రకటన.

హార్మూజ్‌లో భారత నౌకలపై దాడులు.. తీవ్రంగా ఖండించిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: హార్మూజ్ జల సంధిలో గత వారం రోజుల్లో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ అమెరికాను వివరణ కోరింది. ఈ క్రమంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. హార్మూజ్‌లో భారత నౌకలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే భారతీయ నౌకలపై దాడులను సహించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే భారత నౌకలనై ఇరాన్ దాడులు చేసిందని, ఇరాన్ డ్రోన్లను అమెరికా బలగాలు అడ్డుకున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story