ఉరి వేసుకొని వ్యక్తి మృతి..

by Kodari Anjali |

నాయకన్ గూడెం గ్రామంలో షేక్ సుభాని(45) అనే వ్యక్తి మృతి చెందాడు.

ఉరి వేసుకొని వ్యక్తి మృతి..
X

దిశ, కూసుమంచి: మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో షేక్ సుభాని(45) అనే వ్యక్తి మృతి చెందాడు. భార్య షేక్ ఫాతిమా ఫిర్యాదు మేరకు.. మద్యానికి బానిసై కుటుంబానికి సంపాదన ఇవ్వకుండా ఉండేవాడని తెలిపింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించిన నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో తన నివాసంలోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నాడు. అతని కుమారుడు గమనించి వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో కిందకు దించి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి, ఖమ్మంకు తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ తేదీ శుక్రవారం నాడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూసుమంచి ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Next Story