హనోయ్‌లో ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వియత్నాం

by Muthe.Rajitha |

భారత్-వియత్నాం మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్యా రంగ సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో ఇన్వెస్ట్ వియత్నాం, ఐసీఐఈ సంయుక్తంగా ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వియత్నాం కార్యక్రమాన్ని ప్రకటించాయి.

హనోయ్‌లో ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వియత్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్-వియత్నాం మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్యా రంగ సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో ఇన్వెస్ట్ వియత్నాం, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేటర్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ (ఐసీఐఈ) సంయుక్తంగా ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వియత్నాం కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఇన్వెస్ట్ వియత్నాం చైర్మన్, ప్రధాన కార్యనిర్వాహణ అధికారి న్గుయెన్ దిన్ నామ్, ఐసీఐఈ వ్యవస్థాపక కన్వీనర్ సందీప్ కుమార్ మక్తాల హనోయ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. వియత్నాంలోని వ్యాపార, తయారీ, పెట్టుబడి, సాంకేతిక, విద్యా రంగ అవకాశాలను భారతీయ వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వియత్నాం ముఖ్యమైన దేశమని అన్నారు. ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వియత్నాం ద్వారా వ్యాపారవేత్తలు కొత్త మార్కెట్లను అర్థం చేసుకోవడంతోపాటు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు అంతర్జాతీయ విద్యా వేదికలు, పరిశోధన భాగస్వామ్యాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం పొందుతారని తెలిపారు.

జూన్ 24 నుంచి 27 వరకు జరగనున్న ఈ పర్యటనలో ప్రతినిధి బృందం వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, ఇన్వెస్ట్ వియత్నాం, జాతీయ ఆవిష్కరణ కేంద్రం, స్టార్టప్ వేదికలు, పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార సంఘాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో సమావేశం కానుంది. వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, తయారీదారులు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు bit.ly/explore2expand ద్వారా నమోదు చేసుకోవచ్చని.. మరిన్ని వివరాల కోసం +91 8019977575 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Next Story