ఏకధాటిగా వర్షం.. పీలేరు జలమయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-12 14:23:22  IST  )

చిత్తూరు జిల్లా పీలేరులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటికే భారీ వర్షం విరుచుకుపడింది. ఏకధాటిగా రెండు గంటల పాటు విరుచుకుపడింది...

ఏకధాటిగా వర్షం.. పీలేరు జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటికే భారీ వర్షం విరుచుకుపడింది. ఏకధాటిగా రెండు గంటల పాటు విరుచుకుపడింది. దీంతో పీలేరు పట్టణం జలమయం అయింది. ఆర్టీసీ బస్టాండుతో పాటు లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షపు నీరు నిలిచిపోయింది. ఆర్టీసీ బస్టాండుతో మోకాళ్లోతు నీరు నిల్చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటితో వాహనదారులు తీవ్రమైన ఇక్కట్లు పడ్డారు. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలుచోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీరు వెళ్లేందుకు ఇటీవల కాలంలో స్థానికంగా కాలువ నిర్మించినప్పటికీ మొత్తం చెత్త పేరుకుపోవడంతో నీరు మొత్తం బస్టాండ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మోటార్ల ద్వారా నిలిచిపోయిన నీటిని క్లియర్ చేస్తున్నారు.

Next Story