డీఎస్సీ అభ్యర్థులకు జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : మంత్రి లోకేశ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-12 15:34:26  IST  )

కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.

డీఎస్సీ అభ్యర్థులకు జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. డీఎస్సీ అభ్యర్థుల్లో అనవసరంగా ఆందోళన సృష్టించిన జగన్.. అభ్యర్థులందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు. జగన్ చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలని ఈ ఒక్క వీడియోతో అందరికీ తెలిసిందన్నారు. వాస్తవాలు, గణాంకాలతో ఆయన ఆరోపణలను తిప్పుకొట్టామని, తాము మొదటి నుంచీ చెప్తున్న దానినే కోర్టులు కూడా సమర్థించాయని పేర్కొన్నారు. ఫ్యాక్ట్ చెక్ అన్నింటినీ నిరూపిస్తోందని ఆ పోస్టులో లోకేశ్ తెలిపారు.

ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న మంత్రి

విశాఖ రాడిసన్ బ్లూ హోటల్ లో నిర్వహించిన డీజీ ఎక్స్ ఏపీ సదస్సులో భాగంగా నిర్వహించిన ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ సదస్సులో నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై చర్చిందారు. మన దగ్గర ఉన్న అసలైన ఎగుమతులు ఉత్పత్తులు కావని, యువత నైపుణ్యమే మన ఎగుమతి అన్నారు. మంచి భవిష్యత్తు కోసం రాష్ట్ర యువతపై పెట్టుబడి పెట్టడమే మన తొలి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు వెనుకటితరం ఉద్యోగాల కల్పన తమ లక్ష్యం కాదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, మెషీన్ లెర్నింగ్ వంటి భవిష్యత్ తరం ఉద్యోగాల సృష్టి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

Next Story