- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది.

దిశ, ఉండవెల్లి : ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకున్నది. హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి మండలం ప్రాగటూరు గ్రామానికి చెందిన బోయ రాముడుకు ఐదు మంది కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురు బోయ చామంతి 17సంవత్సరాలు అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. గురువారం సప్లమెంటరీ ఫలితాలలో మరోసారి ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వీరన్న పేర్కొన్నారు.






