ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు

by Nallavelli.Anjaneyulu |

సిరిసిల్ల బాలికల టీజీఎంఆర్ఎస్ జూనియర్ కళాశాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.

ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల బాలికల టీజీఎంఆర్ఎస్ జూనియర్ కళాశాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. జిల్లాలోని తంగళ్ళపల్లి మండలంలోని బాలికల టీజీఎంఆర్ఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో బుస్ర కౌసర్ 1000 మార్కులకు గాను 985 మార్కులు, బైపీసీ విభాగంలో ఎం.నందిని 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించినందుకు ప్రతిభా పురస్కారం క్రింద ఒక్కరికి రూ.15 వేల చొప్పున ఇద్దరికి మొత్తం రూ.30వేలు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అందజేసి అభినందించారు.

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం


జిల్లాలోని బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం కొమురవ్వకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. దివ్యాంగురాలైన సాగరిక, దివ్యాంగుడైన వేణు అనారోగ్యానికి గురయ్యారు. వారికి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించారు. కొమురవ్వ భర్త గల్ఫ్ కు వెళ్లి అక్కడే మరణించారు. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను కలిసి తమ ఇబ్బందులను విన్నవించారు. పిల్లలను చూసుకోవడం కోసం తాను ఇంటికే పరిమితమై అయ్యానని, కూలి పనులకు సైతం కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని గోడు వెళ్ళబోసుకుంది. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి జిల్లా సంక్షేమ అధికారితో విచారణ చేయించి, వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం రూ.50 వేల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తమ పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ కు కొమురవ్వ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story