- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏఐటీయూసీ నాయకులు
కార్మికులకు ఈఎస్ఐ డబ్బులను చెల్లించేటట్లుగా సింగరేణి యాజమాన్యం సర్క్యులర్‌ను విడుదల చేసింది.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మే నెల వేతనాలతో పాటు ఈఎస్ఐ డబ్బులను కూడా కాంట్రాక్టర్లు చెల్లించేటట్లుగా సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ ను విడుదల చేసిందని, దాని ప్రకారం జూన్ నెల నుండి ఈఎస్ఐకి అర్హులైన కాంట్రాక్ట్ కార్మికుల అందరి ఖాతాలలో ఈఎస్ఐ నగదు చెల్లించడం ప్రారంభమైందని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. శుక్రవారం నాడు కార్పొరేట్‌లోని సివిల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికుల గేట్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్- ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణ ఫర్ లు మాట్లాడుతూ... సింగరేణిలో ఈ ఎస్ ఐ అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా చేసిన పోరాటాల నేపథ్యంలో, 18 రోజుల సమ్మె ఒప్పందంలో భాగంగా గత సంవత్సరం ఈఎస్ఐలో కాంట్రాక్టర్లను మరియు కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని తెలిపారు.
మెరుగైన వైద్యం పొందవచ్చని..
రిజిస్ట్రేషన్ చేసి సంవత్సరం కావస్తున్నప్పటికీ ఈఎస్ఐ ఖాతాలలో నగదు చెల్లింపులు ప్రారంభం కాకపోవడంతో ఏఐటియుసిగా అనేక సందర్భాల్లో యాజమాన్యానిపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే మే నెల నుండి వేతనాలతో పాటుగా ఈఎస్ఐ డబ్బులు ఈఎస్ఐ ఖాతాలలో చెల్లించేటట్లుగా సింగరేణి యాజమాన్యం సర్క్యులర్‌ను విడుదల చేసిందని, దీని ఫలితంగా నగదు చెల్లింపులు ప్రారంభమైందని నాయకులు తెలిపారు. ఈ ఎస్ ఐ సేవల ద్వారా అనేక గుండె జబ్బులు, క్యాన్సరు, పెద్దపెద్ద ప్రమాదాలకు గురి అయినప్పుడు, రిఫరల్ జబ్బులకు ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్యం పొందవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్యం సేవలను ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఇతర బీమా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్క్యులర్ ను విడుదల చేసిన యాజమాన్యానికి ఏఐటీయూసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జె రమేష్, రబ్బాని పాషా, ప్రవీణ్, శంకర్, భాస్కర్, వీరయ్య, గణేష్, సంపత్, సునీల్,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.






