కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి : సీఎం రేవంత్ డిమాండ్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ప్రాజెక్టు పనులకు కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి : సీఎం రేవంత్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంపై మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిపై ఫైరయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఆయన వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కనుసైగ చేస్తే కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని, ఈటెల రాజేందర్ కు పేరు వస్తుందని మల్కాజ్ గిరిలో మెట్రో రైల్ ను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి చెప్పాలని పలుమార్లు అడిగినా.. వారిదగ్గరి నుంచి స్పందన లేదన్నారు. మోదీకి కిషన్ రెడ్డి ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులపై ఒక్క లేఖ అయినా రాశారా అని చిట్ చాట్ లో నిలదీశారు. IFSC నుంచి రావలసిన అప్పును కూడా కిషన్ రెడ్డే అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు.. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదని దుయ్యబట్టారు.

Next Story