- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో #కార్తీ30 షూటింగ్ షురూ..
తమిళ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న కార్తీ.. ఇప్పుడు తన కెరీర్‌లో 30వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: తమిళ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న కార్తీ.. ఇప్పుడు తన కెరీర్‌లో 30వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ కార్తీ.. తెలుగులో డైరెక్ట్ మూవీ చేయబోతున్నాడు. దీనికి ‘మ్యాడ్’ ఫేమ్ దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీ మొదటి సారి తెలుగులో మూవీ చేయబోతుండగా.. దీనిపై ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ ఏడాది మేలో గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ‘Karthi30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ సందడి భాగ్యనగరంలో మొదలైనట్లు టాక్. జూన్ 4 నుంచి హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ కొనసాగుతుండగా.. కార్తీ, మీనాక్షి చౌదరి కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. డైరెక్టర్ కల్యాణ్ శంకర్ టేకింగ్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్లానింగ్‌తో మంచి ఎంటర్‌టైనర్ లోడ్ అవుతుంది అంటూ షూటింగ్ అప్డేట్ దర్శనమివ్వగా.. న్యూ పెయిర్, బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






