సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ప్రియదర్శి క్రేజీ ప్రాజెక్ట్..!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ కి చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ప్రియదర్శి ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ప్రియదర్శి క్రేజీ ప్రాజెక్ట్..!
X

దిశ, సినిమా: ప్రియదర్శి ‘మల్లేశం’ సినిమాతో హీరోగా మారి, ఆ తర్వాత వచ్చిన ‘బలగం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మధ్య కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. గత ఏడాది విడుదలైన ‘కోర్ట్’ మూవీతో ప్రియదర్శి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టింది. అదే జోష్‌లో ఆయన నటించిన ‘సుయోధన’ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ప్రియదర్శి సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్-3’ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే, ప్రియదర్శి కెరీర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ కి చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ప్రియదర్శి ఒక కొత్త సినిమా చేయబోతున్నట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విభిన్నమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కానీ దర్శకుడు ఎవరనే దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంకరేజ్ చేసే సుకుమార్ బ్యానర్‌లో, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి సినిమా అంటే ఖచ్చితంగా ఇదొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story