- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ నుంచే మొదలు పెట్టారు.. కూటమి నేతలపై సజ్జల సంచలన ఆరోపణలు
by Vemula.Srinu Prasad |
2024 ఎన్నికల పోలింగ్ నుంచే కూటమి అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దగా చేశారని సజ్జల మండిపడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: 2024 ఎన్నికల పోలింగ్ నుంచే కూటమి అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దగా చేశారని సజ్జల మండిపడ్డారు. ప్రజలకు హామీలిచ్చి వంచించడమే చంద్రబాబుకు తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితాంతమంతా ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్ రాజకీయాలని జోస్యం చెప్పారు. అవినీతిలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కూటమి పాలనతో విసిగిపోయారని, మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.
Next Story






