- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాండప్ కామెడీ షో వివాదం... ప్రణీత్, హిమాన్ష్, సెజల్ పై కేసు నమోదు
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రూ. 370 బిర్యానీ డేటింగ్ వ్యాఖ్యల వివాదంపై ఉచ్చు బిగుసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రూ. 370 బిర్యానీ డేటింగ్ వ్యాఖ్యల వివాదంపై ఉచ్చు బిగుసుకుంటుంది. కామెడీ పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అసభ్యకరంగా మాట్లాడారనే ఆరోపణలపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఈ కేసులో అధికారికంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ వివాదంలో స్టాండప్ కామెడియన్ ప్రణీత్ మోర్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యువకుడు హిమాన్షు జంగ్రాతో పాటు.. వైద్య వృత్తిలో ఉంటూ పురుషుల శవాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లేడీ డాక్టర్ సెజల్ పవార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుమోటోగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు పెట్టారు. BNS ప్రకారం లైంగిక పరమైన అనుచిత వ్యాఖ్యలు, సమాజంలో అసభ్యకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి తీవ్రమైన సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అంతే కాదు IT యాక్ట్ ప్రకారం ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వంటి సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు.
డాక్టర్ సెజల్ పవార్‌పై కేసు ఎందుకు?
ఈ కామిక్ షో వివాదంలోకి ఒక లేడీ డాక్టర్ కూడా శవాలపై అనుచిత వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలు బయటికి వచ్చాయి. అదే ప్రణీత్ మోర్ నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో 'డాక్టర్ సెజల్ పవార్' కూడా ఆడియన్స్‌లో కూర్చుని మాట్లాడారు. ఆ సమయంలో ఆమె మెడికల్ కాలేజీ రోజుల్లో తాము రీసెర్చ్ చేసే మగ శవాల (Male Cadavers) ప్రయివేట్ పార్టుల సైజులను పోలుస్తూ, వాటిపై జోకులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా నెట్టింట వైరల్ కావడంతో, వైద్య వృత్తిలో ఉండి మరణించిన వారి పట్ల, పురుషుల పట్ల అంత దిగజారుడుగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు.
విచారణకు సమన్లు.. బిగుస్తున్న ఉచ్చు
మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఇప్పటికే ప్రణీత్ మోర్, హిమాన్షు జంగ్రా, డాక్టర్ సెజల్ పవార్‌లకు అధికారికంగా సమన్లు జారీ చేశారు. తక్షణమే విచారణాధికారి ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు, మహిళలను చులకనగా చూస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ (NCW) కూడా ఇప్పటికే ప్రణీత్ మోర్, హిమాన్షులకు సమన్లు జారీ చేసి వివరణ కోరింది. కామెడీ, క్రౌడ్ వర్క్ పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలతో 'హాస్యానికి ఉండాల్సిన పరిధులు ఏమిటి?', 'కన్సెన్ట్ కు లైంగిక వేధింపుల మధ్య గీత ఎక్కడ ఉంది?' అనే అంశాలపై దేశవ్యాప్తంగా మేధావుల మధ్య చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది.






