- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీసీఐ కూల్చివేతపై కన్నెర్ర..
సీసీఐ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు దానిని శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్ ఆరోపించారు.

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు దానిని శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్ ఆరోపించారు. సీసీఐ కూల్చివేత పనులు ప్రారంభించడం అక్రమం, అన్యాయమని ఆయన మండిపడ్డారు. స్థానిక మున్సిపాలిటీకి రూ.5 కోట్ల బకాయిలు,విద్యుత్ శాఖకు సుమారు రూ.20 కోట్ల బిల్లులు,అర్లి గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్క్రాప్ టెండర్లు పిలిచి కూల్చివేత పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. స్థానిక ప్రభుత్వ సంస్థలను, చట్టాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు.సీసీఐ పునరుద్ధరణ విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే,ఎంపీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాల్సిన కర్మాగారాన్ని మూసివేసి కూల్చివేయడం వల్ల వేలాది మంది ప్రజల ఆశలు దెబ్బతింటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజార్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






