రాజ్యసభ నామినేషన్ రద్దు రగడ: నాంపల్లికోర్టులో కీలక పరిణామం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-12 12:03:20  IST  )

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

రాజ్యసభ నామినేషన్ రద్దు రగడ: నాంపల్లికోర్టులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు రాజ్యసభ్య నామినేషన్ తిరస్కరణ విషయంలో వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ ను రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కింది కోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది.

శ్రీలత అనే మహిళ వేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కంభం శివకుమార్ రెడ్డి తనపై వేధింపులకు పాల్పడి చంపుతానని బెదిరించినా ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఆ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మినాక్షి నటరాజన్ సహా పిటిషన్ లో పేర్కొన్నవారందరిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. ఆ కేసు తమ పరిధిలోకి రాదని పేర్కొంది. పిటిషన్ ను శ్రీలతకు రిటర్న్ చేసి.. ప్రజా ప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఈ కేసు విషయంలోనే రాజ్యసభ ఎన్నికలకు మీనాక్షి వేసిన నామినేషన్ రిజెక్ట్ అయింది.

దీనిపై సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసు లేదన్నారు. ఆమెకు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిందని, ఈ పిటిషన్ ను ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ రిజెక్ట్ అవ్వడంపై మీనాక్షి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ప్రభుత్వంతో ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారని తాను మొదటి నుంచీ చెప్తున్నానని, ఎవరూ దానిని పట్టించుకోలేదని ఆరోపించారు.

Next Story