- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ స్టార్ బ్యూటీ రీ ఎంట్రీ.. ఫైనల్లీ క్లారిటీ ఇచ్చిన టీమ్
బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన కత్రినా కైఫ్.. పెళ్లి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలకు దూరం అయింది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన కత్రినా కైఫ్.. పెళ్లి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలకు దూరం అయింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు మళ్లీ వెండితెరకు ఇవ్వబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పలువురు దర్శకనిర్మాతలు చెబుతున్న కథలు వింటుందని, ఈసారి కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది పలు పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా.. వెబ్ సిరీస్‌లు, డిజిటల్ ఒరిజినల్స్, మహిళా ప్రధాన కథలపై ఆమె ప్రత్యేక ఆసక్తి చూపుతున్నదని, ఇప్పటికే కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడు వర్గాల నుంచి వార్తలు రాగా.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే కత్రినా రీ ఎంట్రీపై తాజాగా టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ‘కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి వస్తుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆమె తన ప్రాధాన్య ప్రస్తుతం మదర్‌హుడ్‌కే పరిమితం చేశారు. ఓటీటీ ఆఫర్ల వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. ఆమె సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇవ్వడానికి ఇంకాస్త టైమ్ ఉంది’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. కత్రినా నిజంగా ఎంట్రీ ఇస్తుందని ఆశపడిన ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.






