పాదయాత్రకు సిద్ధమైన అంబటి.. తేదీ ఖరారు చేస్తూ ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-12 13:50:02  IST  )

వచ్చేది వైఎస్ జగన్ పాలనేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ గుంటూరులో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు

పాదయాత్రకు సిద్ధమైన అంబటి.. తేదీ ఖరారు చేస్తూ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చేది వైఎస్ జగన్(Ys Jagan) పాలనేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Cm Ambati Rambabu) అన్నారు. కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ గుంటూరు(Guntur)లో నిర్వహించిన నిరసన ర్యాలీ(Rally)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారని విమర్శించారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో ఉద్యోగాలకు మంత్రి లోకేశ్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇది ముగ్గురు మోసగాళ్ళ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ‘‘చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు. కూటమి పని గోవిందా గోవిందా.’ అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Next Story