- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పు ఇవ్వలేదనే శివసత్తువు హత్య..
అప్పు అడిగితే ఇవ్వలేదనే శివసత్తువుపై కోపం పెంచుకుని దుండగులు హతమార్చారని తాజాగా పోలీసులు వెల్లడించారు.

దిశ, నల్లగొండ క్రైం: అప్పు అడిగితే ఇవ్వలేదనే శివసత్తువుపై కోపం పెంచుకుని దుండగులు హతమార్చారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రమేష్ నల్లగొండ డీపీవోలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నల్లగొండ పట్టణ పరిధిలోని గొల్లగూడెం నివసించే బోథ్ సాయి కుమార్ (27) గ్రామ దేవతల, ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బగపత్ జిల్లా బదౌత్ మండల కేంద్రానికి చెందిన ఫూర్ఖాన్, ఆరిఫ్, అక్కడి నుంచి బతుకుదెరువుకోసం వచ్చి నటరాజ్ టాకీస్ రోడ్ బొట్టుగూడె, మేథర్ కాలనీలో నివసిస్తూ చీరల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో సాయి కుమార్‌తో ఇరువురికి పరిచయం ఏర్పడి, అప్పుడప్పుడు కలిసి మద్యం సేవించేవారు.
పథకం ప్రకారం దాడి..
తన చీరల వ్యాపార అవసరాల పూర్ఖాన్ సాయి కుమార్‌ను రూ.30వేలు అప్పుగా ఇవ్వమని పలుమార్లు అడిగినా ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్నారు. సాయి కుమార్ వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అతన్ని హత్య చేయాలని నిందితుడు ముందుగానే పథకం రచించాడు. ఈ నెల 8న ఫూర్ఖాన్ తన సహచరుడు ఆరిఫ్‌తో కలిసి సాయి కుమార్‌ను మద్యం పార్టీ పేరుతో మిర్యాలగూడ రోడ్డులోని కేశరాజుపల్లి శివారులో ఉన్న నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించిన అనంతరం రాత్రి సమయంలో డబ్బు అప్పుగా ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ముందుగా రచించిన పథకం ప్రకారం, ఫూర్ఖాన్ మరియు ఆరిఫ్ కలిసి సాయి కుమార్‌పై దాడి చేశారు. ఫూర్ఖాన్ సిమెంట్ రాయితో సాయి కుమార్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆరుగ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం..
హత్య అనంతరం నిందితులు మృతుడి వద్ద ఉన్న బంగారు తాయెత్తు, బంగారు చెవి కమ్మ, ముక్కుపుడకలను తీసుకుని, హోండా ఆక్టివా స్కూటీ, సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా రక్తపు మరకలు అంటిన బట్టలను దాచిపెట్టి, విజయవాడకు పారిపోయి దోచుకున్న బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారంగా నిందితులను గుర్తించి శుక్రవారం ఉదయం విజయవాడలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మొత్తం ఆరుగ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో తిప్పర్తి ఎస్ ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదా బాబు, ఏఎస్ఐ అఫ్జల్ హెడ్ కానిస్టేబుల్స్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, కానిస్టేబుల్స్ జానకిరాములు, రాం రెడ్డి, సునీల్, గుర్వా రెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజులను ఎస్పీ అభినందించారు.






