బేగంబజార్‌లో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దాడులు..

by Kodari Anjali |

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నగరంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం, తనిఖీలు నిర్వహించారు.

బేగంబజార్‌లో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దాడులు..
X

దిశ, కార్వాన్: ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నగరంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం, తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బేగంబజార్ ప్రాంతంలోని పలు షాపులపై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో వివిధ వ్యాపార సంస్థల్లో పని చేస్తున్న సుమారు 20 మంది బాల కార్మికులను అధికారులు సురక్షితంగా రక్షించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు బాలలను పనిలో పెట్టుకున్న షాపు యజమానులకు భారీగా జరిమానా విధించారు. అనంతరం రక్షించిన బాలల తల్లిదండ్రులకు సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను వారికి అప్పగించారు.

శుక్రవారం గోషామహల్ పరిధిలో భారీ ర్యాలీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా గోషామహల్ పోలీస్ స్టేషన్ నుండి ఆంజనేయస్వామి గుడి వరకు బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ, నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బిసిపిఓ శ్రీనివాసులు, సిడబ్ల్యూసి కమిటీ మెంబర్ శోభ, ఆస్రిత్ ఎన్జీవో డైరెక్టర్ నాగరాజు, అసోసియేట్ వాలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లుతో పాటు డిఎల్‌ఎస్‌ఏ స్టాఫ్, డిసిపియు స్టాఫ్, చైల్డ్‌లైన్ సిబ్బంది, మరియు ఎస్ జె పి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story