ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్

by Kodari Anjali |

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఆక్రమానదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మల్లేష్ హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్
X

దిశ, చండూరు: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఆక్రమానదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మల్లేష్ హెచ్చరించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్‌కు సంబంధించిన లేఅవుట్ ఆమోదం సమయంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం, ప్రజా ప్రయోజనాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం విస్తీర్ణంలో 10% భూమిని అనగా 5042 గజాలు మున్సిపాలిటీకి కేటాయించడం జరిగిందన్నారు. కాలక్రమేణా మున్సిపాలిటీకి చెందిన ఈ భూమిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, తదనంతరం క్రయవిక్రయాలకు పాల్పడినట్లు గుర్తించబడిందన్నారు. ఈ నేపథ్యంలో గురువారం చండూరు మున్సిపాలిటీ అధికారులు సంబంధిత భూమికి సంబంధించిన రికార్డులు, లేఅవుట్ పత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించి, అక్రమ ఆక్రమణలను తొలగించి, సంబంధిత భూమిని మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు.

అక్రమ కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా..

భవిష్యత్తులో ఎటువంటి అక్రమ ఆక్రమణలు లేదా అనధికారిక క్రయవిక్రయాలు జరగకుండా ఉండేందుకు ఆ స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబడిందన్నారు. అదేవిధంగా ఇది చండూరు మున్సిపాలిటీకి చెందిన ఆస్తి అని స్పష్టంగా తెలియజేస్తూ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చర్యల ద్వారా మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడం, ప్రజా ప్రయోజనాలను కాపాడడం, ప్రభుత్వ భూములపై అక్రమ కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా చర్యలు చేపట్టబడ్డాయిన్నారు.మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తుల రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత. కాబట్టి ఇటువంటి భూములపై ఎవరైనా అనధికారికంగా ఆక్రమణలు చేయడం, క్రయవిక్రయాలు నిర్వహించడం లేదా మున్సిపాలిటీ హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Next Story