- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల అభివృద్ధి లక్ష్యం : ఎమ్మెల్యే
మంచిర్యాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి నిధులను మంజూరు చేయడం గర్వకారణంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

దిశ, మంచిర్యాల: మంచిర్యాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి నిధులను మంజూరు చేయడం గర్వకారణంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి తన అభ్యర్థన మేరకు సీఎం పిప్పిరి సభలో మాటిచ్చినట్లు తెలిపారు. మాట ప్రకారమే ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులను మంజూరు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రేపు దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అట్లూరి లక్ష్మణ్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ సందర్శన, పట్టణంలోని విశ్వనాధ ఆలయ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ఆదివారం పద్మావతి గార్డెన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పై బూత్ లెవెల్ ఏజెంట్స్, బి ఎల్ ఏ లకు అవగాహన శిక్షణలో డిప్యూటీ సీఎం పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల.సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి. మధుకర్, టిపిసిసి ఉపాధ్యక్షుడు చిట్ల.సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి. తిరుపతి, కార్పొరేటర్లు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






