దుబాయ్‌లో ఉపాధి అవకాశాలు.. క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్లకు ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి తెలిపారు...

దుబాయ్‌లో ఉపాధి అవకాశాలు.. క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్లకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు 23 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అనుభవం ఉండాలి. ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడటం, చదవటం తెలిసి ఉండాలి. ఇవి పూర్తిగా 100 శాతం కమిషన్ ఆధారిత ఉద్యోగాలు. పనితీరు ఆధారంగా నెలకు సుమారు రూ.64,850 నుంచి రూ.1,03,770 వరకు సంపాదించవచ్చని జీఎం తెలిపారు.

ఎంపిక విధానం-దరఖాస్తు గడువు..

ఆసక్తి గల అభ్యర్థులు టామ్‌కామ్ అధికారిక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 25 చివరి తేదీ. వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసిన అనంతరం.. యజమాని అవసరాలు, పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు, సీఐడీ/సెక్యూరిటీ క్లియరెన్స్, వీసా ఆమోదానికి లోబడి తుది ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 9440049520 లేదా 9440048590 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సంస్థ జీఎం నాగభారతి పేర్కొన్నారు.

Next Story