మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణం : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణం : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కుట్రలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఆమె ఓటమికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్సేనన్నారు. ఎవరెవరు ఆమెకు ద్రోహం చేశారో ఆమెనే తెలుసుకోవాలని సూచించారు. మీనాక్షి నటరాజన్ పై ఉన్న కేసుల వివరాలను బీజేపీ నేతలకు ఎవరు అందించారో విచారణ జరుపుకోవాలన్నారు. నోరు తెరిస్తే.. సిట్ మంతం జపించే ముఖ్యమంత్రి.. దీనిపై కూడా సిట్ వేసుకుని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్లాక్ షీప్ ఎవరో కనుక్కోవాలని సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు అని, ఆ కంపులోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీలో మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోలోపలే కుట్రలు చేసుకుని ప్రతిపక్షాలను అందులోకి ఎందుకు లాగుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీలో పదవులు.. డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు తెలుపుతూ.. అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారన్నారు. గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సీఎం పోస్టు.. పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమన్నారు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని.. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని సెటైర్లు వేశారు.

Next Story