- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. హరీష్‌రావుకు మంత్రి పొన్నం సవాల్
సంక్షేమ శాఖల్లో అవినీతి జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీష్‌రావు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

దిశ, హుస్నాబాద్: సంక్షేమ శాఖల్లో అవినీతి జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీష్‌రావు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హరీష్‌రావు అవగాహన లేకుండా మాట్లాడి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మైనార్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలను వరుసగా మైనార్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పారదర్శకతను కాపాడేందుకు నిర్ణయాధికారాన్ని పూర్తిగా ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కు అప్పగించామని చెప్పారు. నాణ్యత, పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే, గత ప్రభుత్వంలో జరిగినట్లే ఇప్పుడు కూడా అవినీతి జరుగుతోందనే భ్రమలో హరీష్‌రావు ఉన్నారని విమర్శించారు. గత పదేళ్లలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసని పేర్కొన్న ఆయన.. తాను, మంత్రి అజారుద్దీన్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కలిసి స్పష్టంగా చెబుతున్నామని, సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్‌రావుకు సూచించిన మంత్రి, పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆరోపణలకు ఆధారాలు లేకపోతే అలాంటి వ్యాఖ్యలను విరమించుకోవాలని హరీష్‌రావుకు హితవు పలికారు.






