బౌద్ధనగర్ డివిజన్‌లో పర్యటించిన మేకల కీర్తి హర్షకిరణ్..

by Kodari Anjali |

బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో డివిజన్ నాయకులతో కలిసి సామాజిక కార్యకర్త మేకల కీర్తి హర్షకిరణ్ పర్యటించారు.

బౌద్ధనగర్ డివిజన్‌లో పర్యటించిన మేకల కీర్తి హర్షకిరణ్..
X

దిశ, సీతాఫలమండి: బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో డివిజన్ నాయకులతో కలిసి సామాజిక కార్యకర్త మేకల కీర్తి హర్షకిరణ్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గల్లీల్లోకి కొట్టుకొచ్చిన వ్యర్థాలు ఇంకా తొలగించకుండా పేరుకుపోయి ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, డ్రైనేజీ పూడికలు తొలగించే పనుల కోసం నాలాపై చేసిన రంధ్రాన్ని అధికారులు మూసివేయకుండా అలాగే వదిలివేయడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు తాత్కాలికంగా ఒక చిన్న చెక్క ముక్కను అడ్డంగా పెట్టినా, మళ్లీ వర్షం కురిస్తే అది కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. రాత్రి వేళల్లో లేదా వర్షం సమయంలో పిల్లలు, వృద్ధులు గమనించకుండా ఆ రంధ్రంలో పడే అవకాశం ఉందని, ఇది ప్రాణాంతక ప్రమాదానికి దారితీసే అవకాశముందని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి గల్లీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు, ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోల్‌ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మేకల కీర్తి హర్షకిరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సతీష్ నేత, శ్యామ్ రాజ్, భిక్షపతి, నాగరాణి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story