ఈ చెఫ్ వంట తింటే లొట్టలు వేయాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

by Gantepaka Srikanth |

పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల కార్పొరేట్ లగ్జరీ కంటే.. మారుతున్న కాలంలో ప్రజలు ఆరోగ్యం, స్వచ్ఛమైన సాంప్రదాయ రుచుల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ చెఫ్ వంట తింటే లొట్టలు వేయాల్సిందే.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల కార్పొరేట్ లగ్జరీ కంటే.. మారుతున్న కాలంలో ప్రజలు ఆరోగ్యం, స్వచ్ఛమైన సాంప్రదాయ రుచుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని నిజం చేస్తూ, ఒకప్పటి 5 స్టార్ హోటల్ చెఫ్.. ప్రస్తుతం రోడ్డు పక్కన చెట్టు కింద వంటలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ 'మారియట్' (Marriott) హోటల్లో చెఫ్‌గా పనిచేసిన అభిలాష్ అనే యువకుడు, తన కార్పొరేట్ లైఫ్‌ను వదులుకుని సరికొత్త బాట పట్టాడు. తన తాతగారి కాలం నాటి సాంప్రదాయ ధాబాను (Traditional Dhaba) తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా హోటళ్లలో వాడే ఎలాంటి ఫుడ్ కలర్స్, టేస్టింగ్ పౌడర్స్ లేదా కృత్రిమ షార్ట్ కట్స్‌ను అభిలాష్ అస్సలు ఉపయోగించకుండా ఓపెన్ తందూర్ (మట్టి పొయ్యి)పై ప్రతి వంటకాన్ని కస్టమర్ల కళ్ల ముందే ఎంతో తాజాగా, రుచికరంగా వండి వడ్డిస్తున్నాడు. 5 స్టార్ హోటల్ స్థాయి నైపుణ్యంతో, మన పాతకాలపు పద్ధతుల్లో వండుతుండటంతో ఈ సరికొత్త రుచులను ఆస్వాదించడానికి భోజనప్రియులు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


Next Story