కాకినాడలో బాలిక అనుమానాస్పద మృతి

by Ajay Maddhiboyina |

కాకినాడ‌లో ఓ బాలిక అనుమానాస్ప‌ద మృతి స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చంద్రిక థియేట‌ర్ స‌మీపంలో కంపా లాఫి అనే బాలిక మృత‌దేహం ల‌భ్య‌మైంది.

కాకినాడలో బాలిక అనుమానాస్పద మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: కాకినాడ‌లో ఓ బాలిక అనుమానాస్ప‌ద మృతి స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చంద్రిక థియేట‌ర్ స‌మీపంలో కంపా లాఫి అనే బాలిక మృత‌దేహం ల‌భ్య‌మైంది. ముల‌గ‌పాటి సందీప్ అనే యువ‌కుడు బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి ఇంటి నుండి తీసుకెళ్లిపోయాడ‌ని ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అత‌డే హ‌త్య చేసి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నాడ‌ని మృతురాలి ఆరోపిస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. నిందితుడిని ప‌ట్టుకుని రావాల‌ని వ‌చ్చిన త‌ర‌వాత మృత‌దేహాన్ని తీసుకెళ‌తామ‌ని కుటుంబ స‌భ్యులు రోడ్డుపై బైటాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. న్యాయం చేస్తామ‌ని, నిందితుడిని ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు హామీ ఇవ్వ‌డంతో ఆందోళ‌న విర‌మించారు. అనంత‌రం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Next Story