భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఒకే రోజు 1695 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల అంచనాలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు సాధించాయి.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఒకే రోజు 1695 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు అమెరికా, ఇరాన్ దాడుల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికి.. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న వివాదం సర్దుమణిగి, ఒక శాంతి ఒప్పందం కొలిక్కి రావచ్చునన్న గ్లోబల్ అంచనాలు మార్కెట్లకు ఊపిరి లూదాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) దిగుమతి ధరలు క్రమంగా దిగి రావడం దేశీయ ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ (Positive sentiment)కు బలమైన కారణమైంది. ఫలితంగా మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి కొనుగోళ్ల వెల్లువ కొనసాగుతోంది.

దీంతో శుక్రవారం ఒక్క రోజే సెన్సెక్స్.. ఏకంగా 1695 పాయింట్లు పైగా భారీ లాభాన్ని నమోదు చేస్తూ 75,470 పాయింట్ల రికార్డు స్థాయి వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 461 పాయింట్ల లాభంతో 23,599 మార్కు వద్ద ముగింపు దిశగా కొనసాగుతుంది. నేటి లాభాల్లో సెన్సెక్స్ 30 ప్రధాన సూచీలో ఎల్అండ్‌టీ (L&T), బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ సంస్థల షేర్లు భారీ కొనుగోళ్లతో లాభాల్లో ముందంజలో ఉన్నాయి. మరోవైపు, మార్కెట్లు ఇంత పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఐటీ రంగానికి చెందిన టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పాటు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు మాత్రం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Next Story