అన్నపురెడ్డిపల్లిలో అసంపూర్తి పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. మూగజీవాల బలి

by Kodari Anjali |

భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు అస్తవ్యస్తంగా, అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపురెడ్డిపల్లిలో అసంపూర్తి పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. మూగజీవాల బలి
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు అస్తవ్యస్తంగా, అసంపూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరడంతో, తాజాగా సెంట్రల్ లైటింగ్ కోసం నిర్మించిన డివైడర్ కందకంలో ఒక గేదె ఇరుక్కుపోయి దయనీయ స్థితిలో ఉన్న దృశ్యం స్థానికులను కలచివేస్తోంది. నిర్లక్ష్యానికి నిదర్శనం సెంట్రల్ లైటింగ్ కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడం వల్ల మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడమే కాకుండా, కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చివేయాలి..

నిర్మాణం ఉండగానే పగుళ్లు ఏర్పడడం ప్రజాధనం వృథా - అధికారుల బాధ్యతారాహిత్యం కిసెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పనుల నాణ్యత లోపంతో పాటు, ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రజల సౌకర్యం కోసం ఉండాలి కానీ, ఇలా మూగజీవాలకు మరణశాసనంగా మారడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేయాలని, అలాగే ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story