చేనులో పని చేస్తుండగా వడదెబ్బతో రైతు మృతి...

by Kodari Anjali |

లచ్చ తండా గ్రామానికి చెందిన జాటోత్ భీమ్జీ (45) శుక్రవారం ఉదయం విషాదకర పరిస్థితుల్లో మృతి చెందారు.

చేనులో పని చేస్తుండగా వడదెబ్బతో రైతు మృతి...
X

దిశ,టేకులపల్లి: మండల పరిధిలోని లచ్చ తండా గ్రామానికి చెందిన జాటోత్ భీమ్జీ (45) శుక్రవారం ఉదయం విషాదకర పరిస్థితుల్లో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. జాటోత్ భీమ్జీ తన వ్యవసాయ పొలంలో పత్తి గింజలు వేస్తుండగా తీవ్ర ఎండ కారణంగా వడదెబ్బ తగిలి ఒక్కసారిగా సృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవారని గ్రామస్థులు తెలిపారు. జాటోత్ భీమ్జీకి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో భార్య, పిల్లలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వడదెబ్బ కారణంగా జరిగిన ఈ ఘటన పట్ల గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. అధికారులు బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story