- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘KA-13’ సినిమాలో కిరణ్ అబ్బవరంతో రొమాన్స్ చేయబోతున్న కన్నడ బ్యూటీ!
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కన్నడ బ్యూటీ దేవికా భట్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలెంటెడ్ నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన తన కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిని అందుకోబోతున్నాడు. నటుడిగానే కాకుండా మొదటిసారిగా తానే దర్శకుడిగా మారి ఒక క్రేజీ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. KA-13 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘ఇచ్చట అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ వండబడును’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో చిత్రబృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత చాగంటి సుధాకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మాస్ అండ్ క్లాస్ మెలోడీల కింగ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించబోయే హీరోయిన్ ఫిక్స్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు.. కన్నడ బ్యూటీ దేవికా భట్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అమ్మడు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవికా భట్ ఈ మూవీతో పాటు ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో వస్తున్న ‘బృందా విహారి’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి, ఆషికా రంగనాథ్ వంటి కన్నడ భామలు మోస్ట్ వాంటెడ్ బ్యూటీస్‌గా మారిపోయారు. ఇప్పుడు అదే బాటలో దేవికా భట్ కూడా కిరణ్ అబ్బవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.






