అభివృద్ధి పనులకు భూసేకరణలను త్వరగా పూర్తి చేయాలి

by Taduka Kalyani |

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భూసేకరణలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులకు భూసేకరణలను త్వరగా పూర్తి చేయాలి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు భూసేకరణలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో భూసేకరణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూసేకరణ పనుల పురోగతి భూయజమానులకు చెల్లించాల్సిన పరిహారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులు చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ యజమానుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఫేస్ -2 వికారాబాద్ జిల్లా గ్రావిటీ కెనాల్ 1,2,3 బొంరాస్ పేట్ దుద్యాల్ కొడంగల్ దౌల్తాబాద్ మండలాలలో 1413 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 1090 ఎకరాలకు ప్రతి పాదనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 323 ఎకరాలకు ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇర్రిగేషన్ రెవెన్యూ సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూసేకరణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద శాతం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించి ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటాచారి డిఆర్ఓ అనిత ఇర్రిగేషన్ ఎస్ఈ శ్రీధర్ ఇఇ సులేమాన్ సెక్షన్ సుపరింటెండెంట్ నఫీజ్ ఫాతిమా తహసిల్దార్లు రాంబాబు కిషన్ వెంకట స్వామి డిఈలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story