క‌బ్జా కాండలో సినిమా స్క్రిప్ట్..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-12 14:07:17  IST  )

కబ్జాలపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు రెవెన్యూ యంత్రాంగం వెళ్లగా సినిమా స్క్రిఫ్ట్ మాదిరి వారికీ వెన్నులో వణుకు పుట్టించారు.

క‌బ్జా కాండలో సినిమా స్క్రిప్ట్..!
X

దిశ, కుత్బుల్లాపూర్ : కబ్జాలపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు రెవెన్యూ యంత్రాంగం వెళ్లగా సినిమా స్క్రిఫ్ట్ మాదిరి వారికీ వెన్నులో వణుకు పుట్టించారు. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బీఆర్ఎస్ లీడర్.. వివరాలు లోకి వెళ్లితే కుత్బుల్లాపూర్ మండలం లోని గాజుల రామారం సర్వే నెంబర్ 79 లో గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నెంబర్ గా చూపుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనుచరుడు, బీఆర్ఎస్ నాయకుడు ఫిరోజ్ గత కొన్ని సవంత్సరాలు నుండి కబ్జాలు చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. సర్వే నెంబర్ 79 లోని ప్రభుత్వ భూమి తెలంగాణ పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం టీజీఐఐసీకి కేటాయించారు. అయితే ఈ స్థలం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కబ్జా దారులు దాదాపుగా కబ్జాలు చేసి కాలనీలు ఏర్పాటు చేసి పేదలకు అమ్మారు. ప్రస్తుతం మిగిలిన కొంత ప్రభుత్వ భూమిని సైతం స్థానిక బీఆర్ఎస్ లీడర్ ఎమ్మెల్యే అనుచరుడు ఫిరోజ్ కబ్జాలు చేస్తూ కోట్లు రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం మాయం చేస్తున్నాడనే ఆరోపణలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి.

ఈ కోవలోనే సామాజిక కార్యకర్త నల్ల జయశంకర్ గౌడ్ ఫిరోజ్ పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో భాగంగా కుత్బుల్లాపూర్ మండలం రెవెన్యూ అధికారులు శుక్రవారం కబ్జా చేసి నిర్మించిన గదులపై విచారణ జరిపి తొలగించేందుకు వెళ్లారు. దీంతో తరచుగా నన్ను అధికారులు వేదిస్తున్నారంటూ డిజీల్ ఒంటిపై పోసుకొని ఫిరోజ్ ఆత్మహత్యయ‌త్నానికి ప్రయత్నించి అధికారులకు షాక్ ఇచ్చారు. నేను సచ్చిపోతా ఇక.. ఏదీ అగ్గిపెట్టె పట్టుకు రండిరా అంటూ తన మనుషులకు చెబుతూ హడావిడి చేశాడు. దీంతో చేసేది లేక రెవెన్యూ అధికారులు ఆత్మహత్య యత్నంను అడ్డుకుని చేసేది లేక వెను తిరిగి వెళ్లిపోయారు. అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని సక్రమంగా విచారించి సర్వే నెంబర్ 79 లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని నల్ల జయశంకర్ డిమాండ్ చేస్తున్నాడు.

Next Story