అనీల్ రావిపూడి ప్రాజెక్టులోకి జీవీ ప్రకాశ్ ఎంట్రీ.. ఓల్డ్ వీడియోతో రీక్రియేట్

by Chukka Sudharani |   (  Updated:2026-06-12 11:52:11  IST  )

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న VenkyAnil5 - NKRAnil2 చిత్రంలో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అనీల్ రావిపూడి ప్రాజెక్టులోకి జీవీ ప్రకాశ్ ఎంట్రీ.. ఓల్డ్ వీడియోతో రీక్రియేట్
X

దిశ, సినిమా: సంక్రాంతి డైరెక్టర్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న అనీల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ అనీల్ రావిపూడి. అనీల్ మామా సినిమా అంటే అందుకే సాంగ్ మస్ట్. ఇందులో భాగంగానే మొన్నటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోతో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఈయన.. ఇప్పుడు తన ప్రాజెక్టులోకి యండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌ను ఆహ్వానించాడు.

దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ‘ప్రేక్షకులతో తక్షణమే మమేకమయ్యే సంగీతాన్ని సృష్టించగల జీవీ ప్రకాష్ కుమార్ సామర్థ్యాన్ని నేను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాను. VenkyAnil5 - NKRAnil2 లోకి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నాము’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో పాత్రలను అనీల్ రావిపూడి, జీవీ ప్రకాశ్ రీక్రియేట్ చేసిన తీరు.. నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియోకు ‘ఈ సరదా కాన్సెప్ట్‌ను అమలు చేయడంలో మేము చాలా ఆనందించాము.. ఈ ఆలోచనను నమ్మి, మనస్ఫూర్తిగా పాల్గొని, దీనిని ఇంత సరదాగా మార్చినందుకు GV కి థాంక్యూ. సోదరా, మనం కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవాలని ఎదురుచూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అనీల్.

Next Story