సురేశ్ మృతి నన్ను ఎంతో బాధించింది: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

ఒమన్ తీరంలో నౌకపై జరిగిన క్షిపణి దాడిలో విశాఖ వాసి, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సురేష్‌ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు...

సురేశ్ మృతి నన్ను ఎంతో బాధించింది: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఒమన్ తీరం(Oman Coast)లో నౌక(Ship)పై జరిగిన క్షిపణి దాడి(Missile attack)లో విశాఖ వాసి, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సురేష్‌ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురేశ్ మృతి తనను ఎంతో బాధించిందన్నారు. ఉద్యోగ నిర్వహణలో ఉండగా అనూహ్యంగా జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సురేష్ మృత దేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story