- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిగ్గుండాలి.. తిరుపతి కూటమి సభపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి, సంక్షేమం పేరిట విజయోత్సవ సభలు పెట్టడానికి కూటమి పార్టీలకు సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తిరుపతిలో కూటమి ప్రభుత్వం వియోత్సవ సభ నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: సుపరిపాలన సాగుతోందని, అభివృద్ధి, సంక్షేమం పేరిట విజయోత్సవ సభలు పెట్టడానికి కూటమి పార్టీలకు సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తిరుపతిలో కూటమి ప్రభుత్వం వియోత్సవ సభ నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవ సభలో అన్ని అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. మొత్తం ఆరు గ్యారంటీలను ఇప్పటివరకూ అమలు చేయలేదని ఆరోపించారు. నెలకు 15 వందలు ఇస్తామని చెప్పిన మహిళాశక్తి పథకానికి దిక్కులేదన్నారు. ‘‘20 లక్షల ఉద్యోగాల జాడలేదు.. లేకుంటే ఇస్తామని చెప్పిన 3 వేల నిరుద్యోగ బృతికి గతి లేదు.. మూడు సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి అంతా సగం సగమే. సూపర్ సిక్స్ ను సూపర్ ఫ్లాప్ చేసి, సూపర్ హిట్ అని చెప్పుకోవడం చంద్రబాబు గారికే సాధ్యం. చేసిన వాగ్దానాలను విలువలేదు . మ్యానిఫెస్టో 143 హామీల అమలుకు అతి గతి లేదు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ చేసి, జాబ్ క్యాలెండర్ ను జాబులు లేని క్యాలెండర్‌గా మార్చారు.’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
పెన్షన్లనే ఊడపీకారు..
‘‘50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఉన్న పెన్షన్లనే ఊడపీకారు. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మోసం చేశారు. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల భూమి ఇస్తామని మాట తప్పారు. పక్కా ఇండ్లు కట్టిస్తామన్న హామీని తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అటకెక్కించారు. కౌలురైతులకు కౌలు కార్డులు దిక్కులేదు. ధరల స్థిరీకరణ అమలు జరగలేదు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పరికరాలు అందలేదు. చివరికి రైతు పండించిన పంట నేలపాలైతే పరిహారం ఇవ్వ చేతకాలేదు. జీవనాడి పోలవరం పూర్తికాలేదు. పెండింగ్ లో ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులకు ముట్టుకోలేదు. 30 శాతం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని 15 వేల కోట్ల చార్జీల భారాన్ని మోపారు. ఫీజు రీయింబర్స్ కొనసాగిస్తామని 7 వేల కోట్ల బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి 3 వేల కోట్ల బకాయిలు ఇవ్వడానికి మనసు రావడం లేదు.’’ అని షర్మిల ఆరోపించారు.
KG to PG ఉచిత విద్య ఏమైంది..?
‘‘పెట్రోల్, డీజిల్ ధరకు నియంత్రణ అని హామీ ఇచ్చి దేశంలోనే అధిక ధరలు మోపారు. KG to PG ఉచిత విద్య, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక వసతులు, జర్నలిస్టులకు ఇండ్లు, ఆక్వా రంగానికి ఊతమంటూ ఇచ్చిన ప్రతి హామీ బూటకమే. విభజన హామీలను విస్మరించి, కేంద్రం నుంచి దక్కాల్సిన నిధులపై మాట మాట్లాడకుండా, ప్రధాని మోడీజీ భజన చేస్తూ, మతాల మధ్య విభజన తెస్తూ, క్రిస్టియన్ మైనారిటీల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసి, రాష్ట్రాన్ని మరో 3.50 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిన కూటమి రెండేళ్ల పాలన రాష్ట్రానికి పట్టిన మరో దౌర్భాగ్యం.’’ అని షర్మిల విమర్శించారు.






