- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ బాలికల (ఎస్ఎంహెచ్) హాస్టల్ మంథనిలో పునః ప్రారంభించాలి
ఎస్సీ బాలికల (ఎస్ఎంహెచ్) హాస్టల్ మంథనిలో పునః ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ అన్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే హాస్టల్ తీసుకపోయి పెద్దపల్లిలో నెలకొల్పారు. గతంలో ఇక్కడున్నటువంటి ఏఎస్ డబ్ల్యూఓ కార్యాలయాన్ని తరలించి ఇక్కడి నుండి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఇక్కడున్నటువంటి ఎస్సీ బాలికల ప్రీమెట్రిక్ హాస్టల్ ను కూల్చివేసి అక్కడ మున్సిపల్ ఆఫీస్ కు స్థలాన్ని కేటాయించారు. ఎస్సీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హాస్టలను మూసివేసి దిశగా డీఎస్డివో వ్యవహరిస్తున్నారన్నారు. మంథని నుంచి తరలించిన హాస్టల్ ను వెంటనే మంథనిలో పునః ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలని మంత్రి ని కోరారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయాన్ని జిల్లా వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ , ఐడీసీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు ఎల్పుల సురేష్, తెలంగాణ రైతు సంఘం నాయకులు రాపల్లి తిరుపతి, దళిత ఐక్యవేదిక నాయకుడు బూడిద తిరుపతి, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి దిగంబర్ పాల్గొన్నారు.






