మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పై నిరసన

by Jakkula.Mamatha |

భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర తన అనుచరులతో నిరసన తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పై నిరసన
X

దిశ, భద్రాచలం: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పై సీబీఐ విచారణ జరిపించాలని , దోషులెవరో తేల్చాలని కోరుతూ అంతర్జాతీయ గాంధీ పథం, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర తన అనుచరులతో నిరసన తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గత 12 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి ఇది పెద్ద కలంకమనీ పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో నమోదు కానీ కేసును ఆధారంగా తీసుకుని, కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహిళామణి మీనాక్షి నటరాజన్ ఎదుగుదలను ఓర్వలేక జరిగిన ఈ ద్రోహం మరియు కుట్ర మామూలు విషయం కాదని మండిపడ్డారు. ఈ విషయం పై సీబీఐ విచారణ జరిపించి ఈ కుట్రకు పాల్పడ్డ దోషులు ఎవరో నిగ్గు తేల్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ గాంధీ పదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ అధ్యక్షులు చింతలచెరువు గెర్శోము, భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి గంజి సంపత్, జక్కం ప్రసాద్, మహిళలు స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story