VIRAL: విడిపోయేటప్పుడు తెలిసిన బంధం విలువ.. కోర్టు మెట్లపై మళ్లీ ఒక్కటైన జంట

by Ajay Maddhiboyina |

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. విడాకులు అప్లై చేసుకుని కోర్టు మెట్లు ఎక్కిన జంట తిరిగి కలుస్తుందని ఎవరూ ఊహించరు కానీ ఢిల్లీలో ఓ జంట కోర్టు మెట్లపై ఒక్కటై అందరినీ ఆశ్యర్యపర్చింది.

VIRAL: విడిపోయేటప్పుడు తెలిసిన బంధం విలువ.. కోర్టు మెట్లపై మళ్లీ ఒక్కటైన జంట
X

దిశ, వెబ్ డెస్క్: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. విడాకులు అప్లై చేసుకుని కోర్టు మెట్లు ఎక్కిన జంట తిరిగి కలుస్తుందని ఎవరూ ఊహించరు కానీ ఢిల్లీలో ఓ జంట కోర్టు మెట్లపై ఒక్కటై అందరినీ ఆశ్యర్యపర్చింది. ఢిల్లీకి చెందిన శిఖ సింగ్, సౌరభ్ లకు 2020లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకు భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. ఈ క్రమంలో శిఖ సింగ్, సౌరభ్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. శిఖ తండ్రి కోర్టు చుట్టూ తిరింగేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.

అలాంటి సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. వైద్యానికి డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడంతో అతడిని చూసేందుకు వచ్చిన సూరభ్ తన మామ పరిస్థితి చూసి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి తన డబ్బులతో వైద్యం చేయించాడు. ఈ క్రమంలో మళ్లీ భార్య, భర్తలు ఒక్కటయ్యారు. ఆ తరవాత ఢిల్లీలోని కోర్టులో విడాకుల కేసుకు సంబంధించి తదుపరి విచారణకు ఇద్దరూ కలిసి హాజరవ్వగా ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు.

Next Story