- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రగిలిపోతున్న మంత్రాలయం.. తీవ్ర ఉద్రిక్తత
కర్నూలు జిల్లా మంత్రాలయం ఒక్కసారిగా రగిలిపోయింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) మంత్రాలయం ఒక్కసారిగా రగిలిపోయింది. టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతల మధ్య ఘర్షణ(Fighting) జరిగింది. దీంతో రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వాహనాలకు నిప్పు పెట్టుకున్నారు. తుఫాన్ వాహనంతో పాటు బైకు కాలి బూడిదయ్యాయి. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో కోసిగిలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ సీరియస్
అయితే మాధవరం నుంచి వెళ్తుండగా స్థానిక టీడీపీ ఇంచార్జి టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి ఇంటి వద్ద వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోసిగిలో కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డారు. తుఫాన్ వాహనం, బైకుకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. మరోసారి ఘటన పునరావృతం కాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, ఎవరు అతిక్రమించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు.






