- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లికి ఊబకాయం ఉంటే.. కూతుళ్లకూ వస్తుందా?
ఒబేసిటీ తల్లి నుంచి కూతురికి సంక్రమించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ వంటివి ఒబేసిటీకి కారణం అవుతుందనే విషయం తెలిసిందే. కానీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో పబ్లిషైన ఒక అధ్యయనం మాత్రం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. ఊబకాయం తల్లుల నుంచి వారి కుమార్తెలకు సంక్రమిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఇది కుమారులకు సంక్రమించదట.
20% మంది పిల్లలపై ప్రభావం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒబేసిటీ సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో అయితే దాదాపు సగం మంది పెద్దలు, 20% మంది పిల్లలను ఇది ప్రభావితం చేస్తోంది. దీనినుంచి కోలుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడి ప్రజలు సగటున173 బిలియన్ డాలర్లలో ఖర్చుచేస్తున్నారని అంచనా. ఒబేసిటీ ఉన్న వ్యక్తుల్లో డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతుంటారు.
హైకొలెస్ట్రాల్ రిస్క్..
‘‘ఊబకాయం లేదా అధిక మొత్తంలో బాడీ ఫ్యాట్ కలిగిన తల్లులకు జన్మించిన అమ్మాయిలు హైకొలెస్ట్రాల్ కలిగి ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మా పరిశోధనలు హైలైట్ చేశాయి’’ అని లైఫ్‌కోర్స్ ఎపిడెమియాలజీ సెంటర్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు 9 ఏళ్లు, అంతకంటే తక్కువ ఏజ్‌గల 240 మంది పిల్లల్లో, వారి పేరెంట్స్‌లో బాడీ కొలెస్ట్రాల్ పరిస్థితిని, కండరాలను కొలువగలిగారు. కచ్చితమైన బాడీ మాస్ ఇండెక్స్ (BMI), అధిక బరువు, ఊబకాయం పరిస్థితులను నిర్ధారించడానికి ఒక స్క్రీనింగ్ టూల్‌ను ఉపయోగించి డేటాను క్రోడీకరించారు. దీని ప్రకారం.. బాలికలు తమ తల్లులకు సమానమైన బీఎంఐ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కలిగి ఉన్నారు. ఇదే పరిస్థితిని అబ్బాయిల్లో పరిశీలించినప్పుడు తల్లుల నుంచి కుమారులకు ఎటువంటి ఒబేసిటీ లక్షణాలు సంక్రమించలేదు.






