- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పరీక్షలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..
నీట్ పరీక్షలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేశారు.

దిశ, కార్వాన్: నీట్ పరీక్షలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద కోక్రోచ్ జనతా పార్టీ సభ్యులు రుచిత్, విజయ్, ఆన్సర్, బిలాల్, అశోక్, సోనమ్ వంచోక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విడివిధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14 న ఇందిరాపార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. మోడీ ఎక్కువకాలం ప్రధానిగా పరిపాలించారని హారతులు పట్టడం కాదు, విద్యార్థుల జీవితాలను సరిదిద్దేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ పార్టీ ఒక ప్రజా ఉద్యమ సంస్థ అని, యువత వల్ల ఏమవుతుందని, కేంద్ర మంత్రి పార్లమెంట్లో అడిగిన ప్రశ్న వల్ల కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడిందన్నారు. ఈ పార్టీ ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే కొన్ని మిలియన్ వీడియోస్ వచ్చాయని అన్నారు.






