జీపీఓ పై దాడికి పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాలి : బ‌య్య సాయినాథ్

by Nallavelli.Anjaneyulu |

జీపీఓ పై దాడికి పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని జీపీఓ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షులు బ‌య్య సాయినాథ్ కోరారు.

జీపీఓ పై దాడికి పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాలి : బ‌య్య సాయినాథ్
X

దిశ‌, ఆర్మూర్ : జీపీఓ పై దాడికి పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని జీపీఓ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షులు బ‌య్య సాయినాథ్ కోరారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా జీపీఓ యూనియన్ పలువురు ప్రతినిధుల కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయ‌న మాట్లాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో అక్రమంగా మొరం మట్టిని తరలిస్తున్న వ్యాపారస్తులను ఆపడానికి వెళ్లిన గ్రామ పాలన అధికారి నరసింహస్వామి, ఇతర రెవెన్యూ అధికారుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు జరగడం వల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంటుందన్నారు. ఇలాంటి దాడులు జరగడం చట్టపరమైన వ్యవస్థకు సవాలుగా మారనుందని, దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి, అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మాట్లాడిన వారిలో జిల్లా జిపిఓ అసోసియేషన్ ప్రతినిధులు గంగా భవాని, కార్యదర్శి సంతోష్, యోగేందర్, భూమేష్ , రమేష్, నరేందర్ సుధాకర్, మోహన్, గంగాధర్, నరేష్, నిఖిల్, జీపీఓలున్నారు.

Next Story