మూవీ లవర్స్‌కు పండగే.. జూలైలో వరుసగా క్రేజీ సినిమాల రిలీజ్

by Pulgam srinivas |

జూలై నెలలో 'నాగబంధం', 'రావు బహదూర్', 'శ్రీనివాస మంగాపురం', 'ఏపిక్', 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాలు విడుదల కానున్నాయి.

మూవీ లవర్స్‌కు పండగే.. జూలైలో వరుసగా క్రేజీ సినిమాల రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: సినిమాలను థియేటర్లలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూసే మూవీ లవర్స్‌కు ఎక్కువ సినిమాలు విడుదలయ్యే సమయం అంటే ఎంతో ఆనందం. అలాంటి వారికి వచ్చే నెల మంచి ట్రీట్ ఉండబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై నెలలో అనేక క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందిన నాగబంధం, అలాగే సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన రావు బహదూర్ చిత్రాలు జూలై 3వ తేదీన విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక జూలై 9వ తేదీన శ్రీనివాస మంగాపురం విడుదల కానుంది. మరోవైపు ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఏపిక్ చిత్రాన్ని జూలై 10వ లేదా 17వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన చెన్నై లవ్ స్టోరీ మూవీని జూలై 24వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా జూలై నెలలో మంచి క్రేజ్ ఉన్న మీడియం రేంజ్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటాయో చూడాలి.

Next Story