- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చియాన్ విక్రమ్ 63 సినిమాలో చాన్స్ దక్కించుకున్న సంయుక్త హెగ్డే..!
ఈ యాక్షన్ డ్రామాలో కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 63వ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రియా శింబు హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై చాలా శరవేగంగా జరుగుతోందిఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామాలో కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
‘కిరిక్ పార్టీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంయుక్త, తెలుగులో నిఖిల్ సరసన దాని రీమేక్ అయిన ‘కిరాక్ పార్టీ’ చిత్రంలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళంలో ‘కోమలి’, ‘పప్పీ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందిచి, చివరగా 'క్రీమ్' అనే చిత్రంలో నటించిన సంయుక్త, 2024 నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు విక్రమ్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడంతో.. ఈ చిత్రంతోనే ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంయుక్త కెరీర్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






