- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీపీ కార్మికులపై సర్కార్ చిన్నచూపు..
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ విమర్శించారు.

దిశ, ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ విమర్శించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికే తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కొంతమంది అధికారులతో కుమ్మక్కై విధుల నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, కేటగిరీల వారీగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 51ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






