కందుకూరులో విషాద ఘటన.. టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం

by Jakkula.Mamatha |

కంచర గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కందుకూరులో విషాద ఘటన.. టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం
X

దిశ, ఇబ్రహీంపట్నం: కంచర గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతమ్మ(45) అనే మహిళ ఆకుల మైలారం ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story