- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరో అంటే ప్రత్యేక ఇష్టం.. శ్రీదేవి విజయ్‌కుమార్ కామెంట్స్ వైరల్
శ్రీదేవి విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రస్తుతానికి ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ 1992లో వచ్చిన "రిక్షా మామ" అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు తమిళ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ఇక 1997లో ఈమె ‘రుక్మిణి’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా శ్రీదేవికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినా ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అందులో భాగంగా కొంతకాలం క్రితమే నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘సుందరకాండ’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తనకు ప్రస్తుతం ఇష్టమైన యువ హీరో ఎవరు అనేది చెప్పుకొచ్చింది. తాజాగా శ్రీదేవి మాట్లాడుతూ... విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం. అతని నటన ఎంతో బాగుంటుంది. నాకు సమయాన్ని బట్టి నచ్చే హీరోలు మారుతూ ఉంటారు. ప్రస్తుతానికి మాత్రం విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని ఈమె చెప్పుకొచ్చింది.






