- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుప్త నిధుల పేరిట భారీ మోసం.. నమ్మించి నట్టేట ముంచిన కిలేడీ జంట!
గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయని వాటిని హిందూ మహిళల మెడలోని పుస్తెలతో పూజలు చేసి శాంతి జరిపి బయటకు తీసి వాటిని అమ్మి రూ.10 వేలకు రూ.20 వేలు, లక్షకు రెండు లక్షలు ఇస్తామని అమాయక మహిళలతో నమ్మబలికి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఓ మైనార్టీ జంట బాగోతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దిశ, మంగపేట: గుప్త నిధుల తవ్వకాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయని వాటిని హిందూ మహిళల మెడలోని పుస్తెలతో పూజలు చేసి శాంతి జరిపి బయటకు తీసి వాటిని అమ్మి రూ.10 వేలకు రూ.20 వేలు, లక్షకు రెండు లక్షలు ఇస్తామని అమాయక మహిళలతో నమ్మబలికి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఓ మైనార్టీ జంట బాగోతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మండలంలోని కమలాపురంకు చెందిన పాటిబండ్ల హన్మంతరావు, సుధాకర్ నాయుడు, డాక్టర్ సంజీవరెడ్డి, గోల్డ్ షాప్ మాధవాచారి, డిష్ రమేష్ అనే వ్యక్తుల భార్యలకు గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డ బంగారం ఇస్తామంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆ దంపతులు వసూలు చేసినట్లు బాధితులు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేశారు.
కమలాపురంలో బయటకు వచ్చిన ఈ మోసంలో సుమారు రూ.15 లక్షల వరకు వసూలు చేశారని వారి మాటల్లో తెలిసిన విషయం. వీరే కాక మరో 20 మంది వరకు బాధితులున్నారు. కమలాపురం, ఏటూరునాగారం మండలాల్లో ఇలా కొన్ని రోజులుగా ఆ దంపతులు గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్విన పాత వీడియోలు చూపిస్తూ అమాయక మహిళలే టార్గెట్ గా భర్తలు ఇళ్లలో లేని సమయంలో మైనార్టీ బార్యా భర్తలు ఇద్దరు వారి దగ్గరకు వెళ్లి అందిన కాడికి దోచుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మైనార్టీ దంపతుల మోసాలకు చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని వాపోతున్నారు.
వీరే కాక మరో రెండు మూడు మహిళల ముఠా గ్రామాల్లో సంచరిస్తూ గుప్త నిధుల బంగారం ఇస్తామంటూ ఇళ్ళల్లో చొరబడి మహిళలకు మాయమాటలు చెప్పి ఒంటిపై బంగారంతో పూజలు చేస్తే బంగారం సొంతం అవుతుందని అందులో మీకు వాటాలిస్తామని ఆశ చూపుతూ వారి బంగారాన్ని దోచుకెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, మల్లంపల్లి, నర్సంపేట, నల్లబెల్లి, ములుగు పసర, తాడ్వాయి చిన్నబోయినపల్లి, ఏటూరునాగారం, మంగపేట గ్రామాలలో అమాయకుల వద్ద నుంచి కోట్లలో నగదు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.






